★అభ్యంతరాలు ఉంటే చెప్పండి: కలెక్టర్ దివాకర్
నేటి గదర్ , ములుగు జిల్లా ప్రతినిధి , జులై 1:
ములుగు:ప్రస్తుతం ఉన్న ములుగు జిల్లా పేరును సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లాగా మార్చుటకు అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్టు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ తెలిపారు. రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రతిపాదనల మేరకు సమ్మక్క- సారలమ్మ ములుగు జిల్లాగా, జిల్లా పేరు మార్చుటకు అభ్యంతరాల స్వీకరణకు నోటీస్ ను విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ దివాకర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పేరును సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లాగా మారుస్తూ పబ్లిక్ నోటీస్ జారీ చేయడం జరిగిందని జిల్లా పేరు మార్చడం పై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే బుదవారం గ్రామాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే గ్రామ సభల ద్వారా తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషలో లిఖిత పూర్వకంగా తెలియజేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.