★ తల్లిదండ్రుల ప్రోత్సాహం తో ప్రతిష్టాత్మక కొలువు సాధించా
★తల్లిదండ్రుల రుణం ఏనాటికి మర్చిపోను
★కష్టపడి ఇష్టంతో చదివితేనే మన గమ్యాన్ని చేరుకుంటాము
★లక్ష్యం చేరేవరకు అవకాశం ఉన్న ప్రతి ప్రయత్నం చెయ్యాలి
★సన్మాన గ్రహీత,IFS పోరిక.లవకుమార్
నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్ , జులై 02:
ములుగు జిల్లా కేంద్రంలో ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాలలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోని ఐఎఫ్ఎస్(IFS) ఉద్యోగం సాధించిన .పోరిక.లవకుమార్ నిములుగు బంజారా కుటుంబ సభ్యులందరూ కలిసి ఘనంగా శాలువతో పూల బొకేలతో పూలు చల్లుతూ ఘన సన్మానం చేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బంజారా నాయకులు మాట్లాడుతూ ఎవరు కూడా ఏ స్థాయిలో ఉన్న మన జాతిని మర్చిపోకూడదని జాతి కోసం ఎవరైతే కష్టపడి పని చేస్తారో తిరిగి జాతి తన కోసం కష్టపడుతుందని తెలుపుతూ చిన్నతనం నుంచి తల్లిదండ్రులు అహర్నిశలు కష్టపడి చదివిస్తే ఉన్నతమైన ఉద్యోగాలు వచ్చే విధంగా సహాయం చేస్తూ వస్తున్నప్పటికీ చాలామంది ఉద్యోగాలు సంపాదించిన తర్వాత ఏ ఒకరిని కూడా గుర్తుపెట్టుకున్న దాఖలాలు లేవని ఆ విధంగా ఎవరు కూడా చేయకూడదని తెలిపారు.ఏదైనా ఒక మొక్క వృక్షం కావాలంటే విత్తనంతో మొదలుకొని ఎన్ని దశలలో దానిని కాపాడుకుంటూ వస్తామో అప్పుడు అది వృక్షమై గాలిని,నీడను,ఫలాలను ఇస్తుంది.ఆ విధంగా ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించిన మన జాతి బిడ్డలు వారికి తోచినంతగా తప్పకుండా జాతి కోసం,జాతి ఉన్నతి కోసం మన జాతిలో ఉన్న నిరుపేద కుటుంబాల కోసం కష్టపడి ఎంతో కొంత మేరకు సహాయం చేస్తే దానికంటే గొప్పతనం లేదని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉద్యోగం సాధించిన పోరిక లవ కుమార్ మాట్లాడుతూ … మనం ఎక్కడున్నా ఏ స్థాయిలో ఉన్న జన్మనిచ్చిన తల్లిదండ్రులను, ఓనమాలు నేర్పిన గురువులను పుట్టిన ఊరును మూలాలను మర్చిపోవద్దని గుర్తుకు చేశారు.సివిల్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సలహాలు ఇస్తూ ఎప్పుడైనా కష్టపడి ఇష్టంతో చదివితేనే మన గమ్యాన్ని చేరుకుంటామని ఒకటే లేదా రెండు ప్రయత్నాలలో మన లక్ష్యం సాధించకపోతే తప్పక మరొక ప్రయత్నం చేయాలని ఆ విధంగా నా యొక్క తల్లిదండ్రుల సహాయంతో ఈ ఉద్యోగం సాధించానని తల్లిదండ్రుల రుణం ఏనాటికి మర్చిపోనని తెలుపుతూ నన్ను గుర్తించి జీవితంలో మరిచిపోలేని విధంగా ఘన సన్మానం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సివిల్స్ ప్రయత్నం చేసే ప్రతి విద్యార్థి కి నా యొక్క సలహాలు సూచనలతో పాటుగా సహాయం కూడా ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో *IFS పోరిక లవకుమార్ తల్లిదండ్రులు పోరిక ప్రమీల-సురిదార్ సింగ్,డాక్టర్ పోరిక రవీందర్,బానోత్ దేవ్ సింగ్,భూక్య సోమ నాయక్,పాల్తియా సారయ్య,అంగోత్ రాజు,పోరిక అనంతరం,భూక్య జంపన్న,మూడ్ కసన్ సింగ్,పోరిక సునీల్ కుమార్, పోరిక శంకర్,గుగులోత్ కిషన్,పాడ్య రవి,అజ్మీర దశరత్,కొర్ర రాజు,లావుడ్యి రమేష్,మాలోత్ రమేష్,భూక్య రవికాంత్,అజ్మీర బావ్ సింగ్,బానోత్ స్వామిదాస్,భూక్య సర్థార్,గుగులోత్ తిరుపతి,బానోత్ అనిల్,అజ్మీర నర్సింగ్,చంటి పాడ్య,జరుపుల పవన్,పాడ్య తులసిరాం,అజ్మీర దేవ్ సింగ్,ధరంసోత్ బాలాజీ,భూక్య రవి,నాగరాజు,తిరుపతి,గణేష్,కుమార్ పాడ్య తదితరులు పాల్గోన్నారు.