★ కూనవరంఎంపీటీసీ గుడిపూడి. కోటేశ్వరరావు సూచన
నేటి గదర్ న్యూస్, మణుగూరు రూరల్:10 ఎకరాల లోపు రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి ఇవ్వాలని మనగూరు మండలం కూనవరం ఎంపీటీసీ గుడిపూడి కోటేశ్వరరావు ప్రభుత్వానికి సూచించారు.బుధవారం మణుగూరు మండలం
గుట్టమల్లారం లోని రైతు వేదిక లో జరిగిన రైతు భరోసా పథకం పై సలహాలు, సూచనలు సమావేశం మణుగూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు కుర్రి. నాగేశ్వరరావు అధ్యక్షత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గుడిపూడి. కోటేశ్వరరావు మాట్లాడుతూ… గత కె సి ఆర్ ప్రభుత్వం ఇటువంటి సమావేశంలు పెట్టకుండా, రైతు బంధు ఇవ్వడం వలన ప్రభుత్వ ఖజనా ఖాళీ ఐనది అని, ఈ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకొని సమావేశంలు పెట్టి రైతుల అభిప్రాయం తీసుకుంట్టున్నారని తెలిపారు. .
★ పది ఎకరాలు లోపు రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి.
★ కొంత మంది రైతులుకు పట్టా భూమి తక్కువ ఉండి, గెట్టు నెంబర్, ఫోర్స్ లో ఉండి వ్యవసాయం చేసే భూమి మొత్తానికి రైతు భరోసా ఇవ్వాలి.
★రైతు భరోసా నుండి రియల్ ఎస్టేట్ చేస్తున్న భూమి ని వెంటనే తీసి వెయ్యాలి.
★ రైతు లకు గిట్టుబాటు ధర ఇవ్వాలి.ఈసమావేశం ద్వారా
పై నాలుగు సూచనలు ప్రభుత్వానికి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు సహకార సంఘం ఉద్యోగులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.