★బాపన కుంట, శివలింగాపురం గ్రామాల్లో మణుగూరు పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
★ ప్రతి వాహనదారుడు సరియైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలి
★మణుగూరు DSP రవీందర్ రెడ్డి
నేటి గదర్ న్యూస్,మణుగూరు టౌన్: ప్రతి వాహనదారుడు సరియైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి అన్నారు .గురువారం మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురం , బాపన కుంట గ్రామాల్లో పోలీసు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాములు భాగంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరియైన ధృవపత్రాలు లేని నాలుగు ఆటోలు, 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని మణుగూరు పోలీస్ స్టేషన్ కి తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. అలాగే ప్రతి షాపుని తనిఖీ చేశారు. ఎలాంటి నిషేధిత మత్తు పదార్థాలు కలిగి ఉన్న , అమ్మకాలు జరిపిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు, అశ్వాపురం సిఐ లు సతీష్ కుమార్,అశోక్ రెడ్డి, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.