★జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి.
★అక్రమ నిర్మాణాలపై వుసేలేని తహశీల్దార్
నేటి గదర్ న్యూస్ , వెంకటాపురం :
వెంకటాపురం విశ్రాంతి భవనంల ఆవరణలో,గొండ్వాన సంక్షేమ పరిషత్ సంఘా ముఖ్య కార్యకర్తల సమావేశం జిఎస్పి సీనియర్ నాయకులు పూనెం మునేశ్వరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి పాల్గొని మాట్లాడుతూ,
5 వ షెడ్యూలు ప్రాంతమైన వెంకటాపురం మండల కేంద్రంలో 1/70 చట్టాన్ని వలస గిరిజనేతరులకు ధారదత్తం చేస్తున్న తాహసిల్దారును వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.గతంలో సమాచార హక్కు చట్టం ప్రకారం ఎల్ టి ఆర్ కేసులు ఎన్ని నమోదు చేశారని అడుగుతున్నప్పటికి కాలయాపన చేస్తున్నాడని, ఆదివాసి సంఘాలను కించ పరిచే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.భారత రాజ్యాంగం చట్టనీ కూడా ఉల్లంఘిస్తుంటే పై అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల భూములకు రక్షణ కరువైందని,గిరిజనేతరులు ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేస్తున్నా వాటి పై ఇంతవరకు చర్య తీకోవడం పై చాలా విమర్శలు వస్తున్నాయని,ఇలాంటి తాహసిల్దారులను మైదాన ప్రాంతాలకు బదిలీ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.ఇంతవరకు ఎల్టిఆర్ కేసుల గురించి నోరు మెదపలేదని ఆయన మండిపడ్డారు. ఈ సమావేశంలో యాలం మనోజు తదితరులు పాల్గొన్నారు.