★22 ఏళ్ళు గడిచినా విద్యుత్ సౌకర్యం లేని బిఎస్ రామయ్య నగర్ ఆదివాసీ గ్రామం
★అధికారులు వస్తారు కరెంటు మరో వారం రోజుల్లో ఇస్తామంటారు.కానీ ఇవ్వరు !
★ఆదివాసీ గ్రామానికి వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించాలి ★సిపిఎం పార్టీ చర్ల మండల కార్యదర్శి మచ్చ రామారావు డిమాండ్
నేటి గదర్ న్యూస్,చర్ల:
చర్ల మండల కేంద్రంలోని సుబ్బంపేట గ్రామపంచాయతీ పరిధిలో గల బిఎస్ రామయ్య నగర్ ను చర్ల మండల కార్యదర్శి మచ్చ రామారావు సందర్శించారు. ఆ సమయంలో గ్రామస్తులందరూ వారికున్న ప్రధాన సమస్యలను సిపిఎం పార్టీ దృష్టికి తీసుకరవడం జరిగింది. దాదాపు 30 కుటుంబాల వారు ఈ గ్రామంలో 22 సంవత్సరాలు గా నివసిస్తున్నా నేటికీ ఈ గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 22 సంవత్సరాల బట్టి ప్రధాన రహదారి పక్కనే ఉన్నటువంటి గ్రామానికి నేటికీ విద్యుత్ సౌకర్యం లేకపోవడం చాలా సిగ్గుచేటని ఆయన అన్నారు. విద్యుత్ సౌకర్యం లేని గ్రామం చీకటి అయితే ఒక ఇంటికి ఒకరు పోయే పరిస్థితి లేదని ఏదైనా అనారోగ్యం వచ్చిన ఎక్కడికి తీసుకెళ్లలేని పరిస్థితి చీకట్లో నెలకొని ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇంటి పన్నులు ఇళ్ల పట్టాలు సిపిఎం పార్టీ మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆధ్వర్యంలో మాకు ఇళ్ల పట్టాలు వచ్చాయని ఇంటి పన్నులు కూడా వచ్చాయని చేతిపంపు బోరు కూడా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వేపించారని ఆ కొద్ది రోజుల తర్వాతనే విద్యుత్ అధికారులు గ్రామాన్ని సందర్శించి విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని మాట ఇచ్చారని అనేక సందర్భాలలో అధికారులను కలిసామని గ్రామస్తులు అన్నారు . అయినా విద్యుత్ సౌకర్యం మా గ్రామానికి నేటి వరకు కల్పించలేదు. గతం లో ఉన్న మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య చొరవతో మా గ్రామానికి నీటి సౌకర్యం ఇంటి పన్నులు ఇళ్ల పట్టాలు మంజూరు అయినాయి కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం మాటలు చెబుతూ సంవత్సరాలు కాలం గడిపారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు .నేటి సిపిఎం పార్టీ కార్యదర్శి మచ్చ రామారావు పర్యటనతో ఆయన ఈ గ్రామంలోని సమస్యల గురించి మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి విద్యుత్ సౌకర్యం లేకపోవడం వలన గిరిజన గ్రామ ప్రజలు పడుతున్న అసౌకర్యాన్ని గుర్తించి వెంటనే ఈ గ్రామానికి విద్యుత్ సౌకర్యం వచ్చే విధంగా మండలంలోని అన్ని శాఖల అధికారులు జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. లేనియెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేసి బిఎస్ రామయ్య నగర్ కు కరెంటు వచ్చేదాకా పోరాటం చేపడుతాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలకం రామారావు ఇర్పా రాజు ఎలగల త్రిమూర్తులు కొట్టం రాములు ఎలకం చినబాబు మడకం శాంతమ్మ ఏలకం శాంతమ్మ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.