★ఐకేపి విఓ లతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు నియామకం
నేటి గద్దర్ కరకగూడెం:కరకగూడెం మండల కెంద్రంలోని ఉన్న ఐటిడిఏ పాఠశాలలు అయిన 12 ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలకు గాను మైనర్ రిపేరు చేయడానికి అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా మంజూరు అయిన పనులను చెయుటకుగాను నిధులు మంజూరు కావడం జరిగింది దానిలో భాగంగా ఎంపిడిఓ కార్యాలయంలో 12 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు
ఐటిడిఏ ఏఈ,ఐకేపి సిబ్బంది, విఓ లతో ఎంపిడిఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.అనంతరం అయన మాట్లాడుతూ మండల పరిధిలోని 12 జిపిఎస్ పాఠశాలల మరమ్మత్తులు చెయించుటకు నిధులు మంజూరు కావడం జరిగిందని ఈనిధుల ద్వారా అయ పాఠశాలల మరమ్మత్తులు చేపట్టుటకు ఈ సమావేశం ఐటిడిఏ ఏఈ ప్రసాద్ సమక్షంలో ఏర్పాటు చేసి కమిటీలను నియమించడం జరిగిందని ఎంపిడిఓ విర వరకుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపి విఓ త్రీగుణ,పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
Post Views: 50