నేటి గదర్ న్యూస్ ,అరకువేలి: మండల పరిధిలో గల యండపల్లి వలస కస్తూరిబా గాంధీ బాలికా పాఠశాలలో అరకు ఎమ్మెల్యే
రేగం మత్స్యలింగం శుక్రవారం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా Mla రేగం ఆ పాఠశాల రికార్డులను పరిశీలించి పాఠశాల విద్యార్థుల విద్యాబోధనపై ఆరా తీసి, విద్యార్థులకు మెరుగైన విద్య అందించేలా కృషి చెయ్యాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి నేరుగా విద్యార్థులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినిలకు పోష్టి ఆహారం అందించాలి ,ప్రతి విద్యార్థిని నీ ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తూ ఉండాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థినిలు చదువులలో రాణించి ఉన్నత స్థాయిలో చేరుకోవాలని కోరారు.
Post Views: 19