నేటి గద్దర్ న్యూస్: మధిర నియోజకవర్గ ప్రతినిధి ✍️ వెంకటేష్ సుంకర. తక్షణమే ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి.కార్పొరేట్,ప్రైవేట్ విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ చేయాలి మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచాలి, నాణ్యత పాటించాలి. ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్ పోస్టులు భర్తీ చేయాలి ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి పి డి ఎస్ యు, పి వై ఎల్ డిమాండ్ ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు కల్పించాలి.ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజులను నియంత్రణ చేయాలని పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు తిప్పారపు లక్ష్మణ్ పి వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ వి రాకేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక మధిర పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు విద్యార్థులతో ప్రదర్శన నిర్వహించి అనంతరం డిప్యూటీ తాసిల్దార్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మధిర మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యల తోటి సతమతమవుతున్న పరిస్థితి ఉందని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజనం నిధులు పెంచి భోజనాన్ని నాణ్యతతో పెట్టాలని వారన్నారు మండలంలో ఉన్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ అరికట్టాలని,పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు లేని యెడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాకేష్ ప్రవీణ్ అన్వేష్ రోహిత్ శర్మ అభిలాష్ సాయి నాగచరణ్ నోబుల్ పాల్గొన్నారు