. నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు.
పి.డి.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్,ఖమ్మం జిల్లా కార్యదర్శి వెంకటేష్.ఖమ్మం గ్రంథాలయం ఎదుట నిరసన తెలిపారు.
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడకుండా ప్రభుత్వం తక్షణమే డీఎస్సీ అభ్యర్థులకు పరీక్ష రాయడం కోసం గడవు పెంచాలని పి.డి.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు ప్రేమ్ సింగ్, పి.డి.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, నిరుద్యోగ నాయకులు రమేష్ కొండలరావు లు డిమాండ్ చేశారు.
ఖమ్మం నగరంలోని గ్రంథాలయం ఎదుట డీఎస్సీ అభ్యర్థులకు పరీక్ష కోసం గడువు పెంచాలని నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
హాస్టల్ వెల్ఫేర్ పరీక్ష జరిగిన తర్వాత డియస్సి పరీక్షకు మధ్యలో కేవలం 15 రోజులు గడువు మాత్రమే ఉన్నందున డీఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యే అవకాశం లేదన్నారు. 12 సంవత్సరాల నుండి డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న డీఎస్సీ అభ్యర్థులకు కేవలం 45 రోజులు గడువు పెంచడం రాష్ట్ర ప్రభుత్వానికి కుదరదా అని ప్రశ్నించారు. పెండ్లిలు చేసుకోకుండా పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత కూడా పిల్లల్ని కనకుండా త్యాగాలు చేసి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాట మాడకుండా వారికి న్యాయం చేయాలన్నారు. తక్షణమే ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థుల న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కారం కోసం మానవతా కోణంలో పరీక్ష రాయడానికి 45 రోజుల గడువు పొడిగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు శ్రీను, మహేందర్, డీఎస్సీ అభ్యర్థులు మమత రాకేష్ శ్రీనివాస్ అమర్నాథ్ శ్రావ్య తదితరులు పాల్గొన్నారు.