రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 9:
మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడటం ఎక్కువసార్లు భూమిని దున్నడం, పంట వ్యర్థాలను కాల్చడం ట్రాక్టర్ కేజీవీల్ తో లోతుగా దుమ్ము చేయడం ,సరైన పద్ధతిలో నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడం, పంటల మార్పిడి చేయకపోవడం వంటి కారణాల చేత నేలలో సేంద్రీయ కర్బన పదార్థం తగ్గిపోతుంది సేంద్రియ కర్భన పదార్థం తగ్గడం వల్ల పంటకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులు మరియు వానపాముల సంతతి తగ్గిపోవడం వల్ల పంటల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది నేల చౌడబారుతుంది నీటిని నిలుపుకొని ఉంచుకునే శక్తి తగ్గుతుంది ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాఖ రైతులకు సేంద్రీయ కర్బన పదార్థం పెంపుపై అవగాహన కల్పిస్తుంది అందులో భాగంగా 60 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలను అందజేస్తూ పచ్చి రొట్ట విత్తనాలను నాటడం ద్వారా పచ్చిరొట్ట పంటలను పెంచడం వాటిని కలియ దున్నడం వల్ల కలిగే లాభాలను రైతులకు అవగాహన కల్పిస్తుంది ఇందులో భాగంగా మంగళవారం రోజు మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో పచ్చిరొట్ట పంటలైనటువంటి జీలుగా క్షేత్రాన్ని సందర్శించి రైతులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ మాట్లాడుతూ జీలుగా జనుము వంటి పంటలను భూమిలో విత్తి 40 నుండి 45 రోజుల తర్వాత వాటిని కలియ దున్ని నట్లయితే ఒక ఎకరాకు 12 టన్నుల పచ్చి రొట్ట సేంద్రియ ఎరువు భూమిలో కలుస్తుందని తెలిపారు.ఈ విధానం ద్వారా భూమిలో సేంద్రీయ కర్బన పదార్థం పెరుగుతుంది పంటకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవుల మరియు వానపాముల సంతతి పెరగడం వల్ల నేల సారవంతం అవుతుందన్నారు.అదేవిధంగా పచ్చిరొట్ట పంటలైనటువంటి జీలుగా జనుము వేళ్లలోని బుడిపెల ద్వారా గాలిలోని నత్రజని ని నేలలో నిక్షిప్తం చేయడం ద్వారా రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది రసాయన ఎరువుల వాడకం తగ్గడం ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.అదేవిధంగా నీటిని నిలుపుకునే శక్తి పెరుగుతుంది. సేంద్రీయ కర్బన పదార్థం పెంచడం వల్ల నేల కోతకు గురికాకుండా అరికడుతుంది మరియు భూమిలో భూ భౌతిక రసాయన మార్పుల వల్ల పంట యొక్క వేర్లు లోతుగా చొచ్చుకొని పోయి అందుబాటులో లేనటువంటి పోషకాలను అందుబాటులోనికి అయ్యేవిధంగా సేంద్రియ కర్బన పదార్థం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా పంట దిగుబడి పెరిగి రైతుకు ఆదాయం పెరుగుతుందన్నారు.ఇది పప్పు జాతి పంట కాబట్టి వరి వేసేటువంటి రైతులు ఈ పంటను వేసుకున్నట్లయితే పంట మార్పిడి కూడా జరుగుతుంది పంట మార్పిడి జరగడం వల్ల వరి పంటలో వచ్చేటువంటి చీడపీడలు తెగులు ఉధృతి తగ్గి వీటిని నివారించుకునేటువంటి పురుగు మందులు తెగులు మందులపై ఖర్చు రైతుకు కలిసి వస్తుందన్నారు.కాబట్టి రైతులు తప్పనిసరిగా సేంద్రియ కర్బన పదార్థం పెంచే విధంగా పచ్చిరొట్ట పంటలను పెంపకం ,పంటల మార్పిడి, చెరువు నల్ల మట్టిని తోలడం, తక్కువసార్లు దున్నడం మోతాదుకు మేరకే రసాయన ఎరువుల వాడకం సరైన సమయంలో నీటిపారుదల ఏర్పాటు చేసుకోవడం వంటి చర్యలు చేపట్టినట్టయితే సేంద్రియ కర్బన పదార్థం పెంపొందించే అవకాశం ఉందన్నారు.సేంద్రియ కర్బన పదార్థం పెరగడం ద్వారా ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగే అవకాశం ఉన్నందున రైతులు తప్పనిసరిగా పచ్చిరొట్ట పంటలను పెంచి 40-45 రోజుల తర్వాత కలియ దున్నాలని తెలిపారు. నేలలో కలియ దున్నేటప్పుడు సింగిల్ సూపర్ ఫాస్పేట్ 100 కేజీలు లేదా వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో వారం రోజులపాటు మాగబెట్టి పచ్చిరొట్ట పంటలను కలియ దున్నెటప్పుడు చల్లుకున్నట్లయితే ఈ పచ్చిరొట్ట ఎరువు తొందరగా కుళ్ళిపోయి భూమిలో సేంద్రీయ కర్బన పదార్థం పెరిగే అవకాశం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో రైతులు మరియు వ్యవసాయ విస్తీర్ణాధికారి సాయి కృష్ణ పాల్గొన్నారు.