+91 95819 05907

పొదేం కు నామినేటెడ్ పోస్ట్:పినపాక కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక:
పిసిసి ఉపాధ్యక్షులు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి అధ్యక్షులు, భద్రాచలం మాజీ శాసనసభ్యులు పొదెం వీరయ్యకు తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, పినపాక మండల కాంగ్రెస్ అధ్యక్షులు గొడిశాల రామనాధం ఆధ్వర్యంలో బయ్యారం క్రాస్ రోడ్ లో విజయోత్సవాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి జై పోదేం వీరన్న నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలతో భారీ సంఖ్యలో ర్యాలీగా బయలుదేరి క్రాస్ రోడ్ జంక్షన్ లో టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం రామనాథం మాట్లాడుతూ.. నీతికి నిజాయితీకి కట్టుకున్న విలువలకు నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం పోదేం వీరయ్య అని కొనియాడారు. అడవి తల్లి బిడ్డగా పేరున్న వీరన్న, ఏజెన్సీలో నెలకొన్న పోడు భూముల వివాదాలు సమర్థవంతంగా పరిష్కరిస్తారనే నమ్మకంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు. ఎందరు పార్టీలు మారినా ఎన్ని కుట్రలు చేసినా, తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని ఎన్నటికీ వీడలేదని.. వీరన్న విధేయతకు మెచ్చి రాష్ట్ర అటవీశాఖ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కొంబత్తిని శ్రీనివాస్ రావు, జనరల్ సెక్రటరీ జక్కా వెంకటేశ్వర్లు,మండల మైనారిటీ అధ్యక్షులు షేక్ మదర్ సాహెబ్, ఎస్టీ సెల్ నాయకులు కొమరం రమేష్, యాలం బుజ్జిబాబు, రైతు కిసాన్ నాయకులు ఏలూరి వెంకట రెడ్డి, సీనియర్ నాయకులు గంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తాల్లూరి కాంతారావు, వంక నరసింహ రావు, కాయం జగపతి రావ్, కొమరం వెంకటేశ్వర్లు, మునిగల వెంకటేశ్వర్లు, స్వతంత్ర రెడ్డి, చెట్టిపల్లి గంగరాజు, యువనాయకులు కొండేరు సంపత్, బోడ లక్ష్మణ్ రావ్, గిద్దె వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం ఇంటింటా సర్వే జరిగింది. సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి,

Read More »

రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు..

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు మండలం రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు నిర్వహించడం జరిగింది ఇట్టి తనికీ లలో 1)గుగులోతు స్వరూప W/o శ్రీను 2)భూక్య

Read More »

 Don't Miss this News !