పోలీస్ ఆధ్వర్యంలో ముంపు ప్రాంత ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీస్…
అనేక ఏళ్లుగా ముంపుకు గురవుతున్న గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని పోలీస్ విజ్ఞప్తి…
నేటి గదర్ న్యూస్ మణుగూరు జూలై 9:
మణుగూరు మున్సిపాలిటీ ప్రాంతంలోని కమలాపురం, చిన్నరాయిగూడెం,అన్నారం గుంపు ప్రాంత గ్రామాలను పోలీస్ సందర్శించి వరదలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ,అనేక ఏళ్లుగా చిన్నరాయిగూడెం, కమలాపురం,అన్నారం బెస్తగూడెం గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని,ఈ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఈ గ్రామాలు ప్రతి సంవత్సరం వరద ముక్కు గురవుతున్నటువంటి పరిస్థితి ఉందని ముందస్తుగా గోదావరి ముంపుకు గురి కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ప్రజలకు పోలీస్ భరోసా కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన తక్షణమే పోలీసుకీ సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మణుగూరు సిఐ సతీష్ కుమార్,పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.