– నిబంధనలు పాటించాల్సిందే డిఎల్పిఓ
– వేలంపాటలో సంతను కైవసం చేసుకున్న జర్పుల సురేష్
నేటి గదర్, జూలై 12,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశీ, 9052354516 :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక సంత రూ 6.60 లక్షలకు పాడడం జరిగింది. శుక్రవారం బూర్గంపాడు మండల పరిధి లోని సారపాక పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి మహేష్ అధ్యక్షతన జరిగిన సంత వేలంపాటలో డి ఎల్ పి ఓ పవన్ కుమార్ పాల్గొని పర్యవేక్షించారు. ఉదయం 11 గంటలకు మొదలైన సారపాక సంత వేలంపాట కార్యక్రమంలో సంత నిర్వహణలో జరుగుతున్న పలు విషయాలను అధికారుల ముందు లేవనెత్తి ప్రశ్నించారు. నేషనల్ హైవే రోడ్డుపై సంతను నిర్వహించడానికి వీల్లేదని పలువురు నాయకులు స్థానికులు అధికారులకు వెల్లడించారు. సంత నిర్వహణలో అధిక రేట్లు వసూళ్లకు పాల్పడడంపై, ఇతర సమస్యలపై ఆరోపణలు గుప్పించారు. కాగా అధికారులు తమ వద్దకు వచ్చిన ఆరోపణలపై, సమస్యలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంతను సుమారు మూడు నెలల పాటు ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రదేశంలో కొనసాగించాలని, ఈ మూడు నెలల తర్వాత సంత నిర్వహించడానికి అనువైన ప్రాంతాన్ని సంత నిర్వాహకులకు చూపిస్తామని వెల్లడించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నేషనల్ హైవేపై సంతను నిర్వహించరాదని వేలంపాటకు ముందే పాట దరఖాస్తుదారులకు తెలిపారు.
– వేలంపాటలో సంతను కైవసం చేసుకున్న జర్పుల సురేష్
సుమారు రెండు గంటల పాటు సాగిన చర్చల అనంతరం వేలంపాటను అధికారులు మొదలుపెట్టారు. ప్రభుత్వం పాట నాలుగు లక్షల రూపాయలతో మొదలైన వేలంపాటలో ఎవరైనా పాటను పెంచాలనుకుంటే పదివేల రూపాయలు పెంచి పాడాలనే నియమంతో అధికారులు వేలంపాటను ప్రారంభించారు. అలా పోటాపోటీగా సాగిన వేలం పాటలు చివరకు 6 లక్షల 60 వేల రూపాయలతో జర్పుల సురేష్ అధిక మొత్తంలో వేలం పాటను పాడి సారపాక సంతను కైవసం చేసుకున్నారు. అనంతరం అధికారులు ప్రభుత్వ నిబంధన ప్రకారం సంత వేలం పాటలో విజేతను ప్రకటించారు.