నేటి గద్దర్ పాడేరు న్యూస్:
అల్లూరి జిల్లా పాడేరు జూలై స్వయం సహాయ సంఘాల సభ్యులకు వ్యక్తిగత స్వయం ఉపాధి యూనిట్లును మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ చెప్పారు. శుక్రవారం ఐటిడి ఏ సమావేశ మందిరంలో అరకు వ్యాలీ మండలానికి చెందిన 38 స్వయం సహాయ సంఘాలకు రూ.2కోట్ల 70 లక్షల 90 వేల బ్యాంకు లింకేజీ చెక్కును పంపిణీ చేసారు. ఈ సందర్భంగా స్వయం సహాయ సంఘాల సభ్యులతో మాట్లాడుతూ ఈ డబ్బును ఏం చేస్తారని ప్రశ్నించారు. సభ్యులు కుట్టు మిషన్లు ఏర్పాటు చేసుకున్నామని, వారపు సంతలో చిరువ్యాపారాలు చేస్తుంటామని కలెక్టర్కు వివరించారు. కేంద్ర ప్రభుత్వం అనేక వ్యక్తి గత పథకాలు ప్రవేశ పెట్టిందని అటువంటి పథకాలు మంజూరు చేయాలని డి. ఆర్. డి. ఏ .పి.డికి సూచించారు. అంతక ముందు ఐటిడి ఏ సమావేశ మందిరం వద్ద ఏర్పాటు చేసిన చిరుధాన్యాలు, ఆకు కూరలు,కూరగాయల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావనా పశిష్ట, ఐటిడి ఏ పి ఓ వి. అభిషేక్, డి. ఆర్ . డి. ఏ పి.డి. వి.మురళి తదిరతరులు పాల్గొన్నారు.