నేటి గదర్ న్యూస్ , జులై 12 (కొమ్ము ప్రభాకర్ రావు పాలేరు నియోజకవర్గం):
ఇటీవల హైదరాబాద్ లో జర్నలిస్టులపై జరిగిన దాడిని నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ అధిష్టానం తీవ్రంగా ఖండించింది. ఉస్మానియా యూనివర్సిటీలో DSC అభ్యర్డులు చేస్తున్న ఆందోళను విధినిర్వహణలో భాగంగా కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై పోలీసులు దాడి చేయడం చాలా బాధాకరం. దేశానికి నాలుగో స్థంభమైన మీడియా వీలేకరులపై దాడి చేయడం సిగ్గుచేటు. ఈ దాడిని నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ సీనియర్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ తీవ్రంగా ఖండిస్తున్నామని పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ డాక్టర్. సి.హెచ్. విజయ్ మోహన్ రావు మాట్లాడుతూ.. ఇటువంటి భౌతిక దాడులు మానవ హక్కుల ఉల్లంఘన, మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న దాని క్రిందికే వస్తాయి. కాబట్టి వెంటనే సంబందిత పోలీసు ఉన్నతదికారులు చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేస్తూ, పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
అనంతరం నేషనల్ మానేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్ రావు మాట్లాడుతూ… ఇది చాలా హెయమైన చర్య ఎట్టిపరిస్థిలో మీడియా మిత్రులపై దాడికి పాలుపడిన వారిని వదిలి పెట్టవద్దు చట్టరీత్యా చర్యలు తీసుకొని మరోసారి పునరావృతం కాకుండా చూడాలని పత్రిక ముఖంగా కోరారు.
ఈ క్రమములో నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ లీగల్ అడ్వైసర్ డాక్టర్ వేల్పుల కృష్ణ యాదవ్ మరియు నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జాన్ కాంతారావు మాట్లాడుతూ పోలీసుల అతి ఉత్సాహం మంచిదికాదు. పోలీసులకు కొట్టె అధికారం ఎవరిచ్చారు? పోలీసు అధికారులు తమ హద్దులు మీరి ఇలా మీడియా మిత్రులపై దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నామని వారు పేర్కొన్నారు .