– సభ్యులందరికీ యూనియన్ అండగా ఉంటుంది : యూనియన్ ప్రెసిడెంట్ జానీ
నేటి గదర్, జూలై 14,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశీ 9052354516 :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక పంచాయతీ గాంధీనగర్ కి చెందిన ఆటో డ్రైవర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక ఆదివారం జరిగింది. ఈ ఎన్నికలో యూనియన్ ప్రెసిడెంట్ ఎస్కే జానీ, గౌరవ అధక్షులు ఎం రమేష్, వైస్ ప్రెసిడెంట్ జి.నరసింహులు, సెక్రటరీ ఓ.నాగరాజు, జాయింట్ సెక్రటరీ పి.శేఖర్, ట్రెజరీ పి.కుట్ట, యూత్ ప్రెసిడెంట్ ఏ.సంతోష్ కుమార్ లను యూనియన్ సభ్యులు ఎన్నుకున్నారు. అనంతరం సారపాక సెంటర్ నుండి గాంధీనగర్ వరకు ఆటో యూనియన్ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ… తమపైన నమ్మకంతో తమను యూనియన్ నాయకులుగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన బాధ్యతను నూటికి నూరు శాతం పూర్తిచేసేందుకు కృషి చేస్తామని, యూనియన్ సభ్యులకు ఎటువంటి సమస్యలైనా తమ యూనియన్ తరపున అండగా ఉంటామని అన్నారు. అదేవిధంగా యూనియన్ సభ్యులు ఎటువంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా, బాధ్యతాయుతంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అంతంత మాత్రంగా ఉన్న ఆటో డ్రైవర్ల పరిస్థితి ఉచిత బస్సుతో మరింత ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో కార్మికుల సమస్యలను, వారి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని, ఆటో డ్రైవర్లకు ప్రభుత్వాలు అండగా ఉండాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు చిట్టి పవన్ కుమార్, జమిలి నవీన్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.