★ఈనెల 29న కలెక్టరేట్ ముందు ధర్నా
★సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కేచ్చల రంగయ్య మాజీ ఎమ్మెల్యే గుమ్మడి
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం:
ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం అవుతుందని ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మీనమేషాలు లెక్కపెట్టకుండా బేషరతుగా అమలుకు పూనుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కేచ్చల రంగయ్య మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి స్థానిక కొత్తగూడెం జిల్లా కార్యాలయంలో డిమాండ్స్ తో కూడిన కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.
రైతు రుణమాఫీ పెంచి ఇస్తామని చెప్పిన పెన్షన్లు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు ఇల్లు రేషన్ కార్డులు అర్హులైన వారందరికీ డబ్బులు బెడ్ రూమ్ ఇల్లు ఉచిత వైద్యం ఉచిత విద్య తదితర హామీలు ఇంకెప్పుడు అమలు చేస్తారని వారు ప్రశ్నించారు ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22న మండల కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించాలని అదేవిధంగా ఈనెల 29న కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించనున్నామని అన్నారు. ఈ కార్యక్రమాలను ప్రజలు పార్టీ శ్రేణులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు .ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేకపోతే గత పాలకులకు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షం నాయిని రాజు జాటోత్ కృష్ణ చండ్ర అరుణ అమర్లపూడి రాము నూప భాస్కర్ కల్పనక్క గోకినపల్లి ప్రభాకర్ మధుసూదన్ రెడ్డి మాచర్ల సత్యం తదితరులు పాల్గొన్నారు.