నేటి గదర్, జూలై 14,
ములుగు జిల్లా ప్రతినిధి,
కే.కౌశిక్,6281272659
ఒకే వ్యక్తికి రెండు పెన్షన్లు తీసుకోవడం రూల్స్ కు విరుద్ధమని మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దానసరి అనసూర్య సీతక్క పెన్షన్ల రికవరీ పై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… దాసరి మల్లమ్మకు వృద్ధాప్య పెన్షన్ రికవరీ నోటీసుపై రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, స్త్రీశిశు సంక్షేమశాఖల మంత్రి ధనసరి సీతక్క గారు వివరణ ఇచ్చారు. ANM ఉద్యోగిగా చేస్తూ కుమార్తె చనిపోవడంతో మల్లమ్మకు నెలకు రూ.24,073/- కుటుంబ పెన్షన్ వస్తుందని తెలిపారు. ఇదే సమయంలో ఆమె వృద్ధాప్య పెన్షన్ సైతం తీసుకుంటోందని, ఒకే వ్యక్తి రెండు పెన్షన్లు పొందడం రూల్స్ విరుద్ధమని పేర్కొన్నారు. 1,826 మంది 2 పెన్షన్లు పొందుతున్నట్లు ట్రెజరీ గుర్తించి నోటీసులిచ్చిందని మంత్రి సీతక్క వెల్లడించారు.









