నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ
ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి
నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి
సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు
నేటి గదర్ న్యూస్, వైరా :
అమరజీవి కామ్రేడ్ మాడపాటి కమలమ్మ నేటి తరానికి ఆదర్శం అని, నిబద్ధత కలిగిన ఆదర్శ కమ్యూనిస్టు మాడపాటి కమలమ్మ ఆశయాల సాధన కోసం కృషి చేయాలని, ఎర్రజెండా నీడలో ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటాలు చేయడం ద్వారా మాడపాటి కమలమ్మకు నిజమైన నివాళులు అర్పించాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు అన్నారు. బుధవారం వైరా మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో పట్టణ నాయకులు గుడిమెట్ల మోహన్ రావు అధ్యక్షతన పార్టీ నాయకురాలు మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాడపాటి కమలమ్మ చిత్ర పటానికి పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాడపాటి కమలమ్మ స్మారక స్తూపం వద్ధ పార్టీ జెండాను పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన వర్ధంతి సభలో భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు మాట్లాడుతూ మాడపాటి కమలమ్మ తన జీవితాంతం పేద ప్రజల కోసం కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నమ్ముకొని సొంత స్వార్థం లేకుండా పని చేశారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొనే ధైర్యశాలి అన్నారు. నాటి నుంచి నేటి వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నికరంగా నిలబడి నిరంతరం పోరాడుతున్నది ఒక్క కమ్యూనిస్టులే అన్నారు. నేడు పాలకవర్గాలు ప్రజల సంక్షేమం గాలికి వదిలేసి కార్పొరేట్ సంస్థలు సేవలో మునిగి పోయారని అన్నారు. మతం పేరుతో ప్రజల మధ్య విభజన తీసుకు వస్తూ ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడులను ప్రతి కార్యకర్త ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు.
బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ కార్పొరేట్లు, బడా పెట్టుబడిదారుల ఊడిగం చేస్తున్నారని, లక్షల కోట్ల రూపాయలు దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతున్నారని విమర్శించారు. అమేరిక సామ్రాజ్యవాదానికి లొంగీన మోడీ ఇరాన్ పై జరుగుతున్న దాడుల పై కనీసం నోరు కూడా మెదపడం లేదని అన్నారు. గ్యాస్ కొరతతో దేశ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించక పోవడం దారుణం అన్నారు. పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో మాడపాటి కమలమ్మ జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. ప్రతి కార్యకర్త మాడపాటి కమలమ్మ ఆశయాల సాధన కోసం ముందుకు సాగాలని, అదే ఆమేకు ఇచ్చే నిజమైన నివాళని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేయడమే మాడపాటి కమలమ్మకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం) పార్టీ వైరా డివిజన్ కార్యదర్శివర్గ సభ్యురాలు మచ్చా మణి, డివిజన్ కమిటీ సభ్యులు తోట నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు పొధిల హరినాథ్, సిపిఐ(ఎం) నాయకులు కొంగర సుధాకర్, షేక్ నాగుల్ పాషా, 19వ వార్డు కౌన్సిలర్ చింతనిప్పు సులోచన, తెలంగాణ రైతు సంఘం వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, సిఐటియూ వైరా పట్టణ కన్వీనర్ అనుమోలు రామారావు, యనమద్ది రామకృష్ణ,సంక్రాంతి పురుషోత్తమరావు, సంక్రాంతి పుల్లయ్య, అమరనేని కృష్ణ, కర్నాటి బాబురావు, పాసంగులపాటి చలపతిరావు, మాడపాటి కమలమ్మ కుమారులు మాడపాటి మల్లికార్జునరావు, మాడపాటి వెంకటేశ్వరరావు, మాడపాటి సుజాత, మాడపాటి శ్రీనాథ్,
మాడపాటి రాజేష్, కమలమ్మ కుమారులు, కుమార్తెలు, అల్లుళ్లు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్లు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.








