**
పాల్గొన్న తాసిల్దార్ జ్ఞానం జ్యోతి.
సర్పంచ్ ఫోరంల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వీరన్నగారికృష్ణారెడ్డి.
నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చ్ 20.
మాసాయిపేట మండల కేంద్రంలో శుక్రవారం మొదటి గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో సమస్యలపై ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు కావలసిన పనుల గురించి చర్చించారు. ముఖ్యంగా డ్రైనేజీ కరెంటు తో రైతులు పడుతున్న కష్టాలు ఏఈ దృష్టికి తీసుకెళ్లారు. వీధి దీపాలు, స్కూల్లో జరుగుతున్న సంగీత కార్యక్రమాలు కాంపౌండ్ వాల్ నిర్మాణం కొరకు దరఖాస్తు నూతన గృహ నిర్మాణ సెట్ బ్యాక్ రోడ్ల వెడల్పు నూతనంగా ఏర్పడుతున్న 33 కెవి లైన్ గురించి తడి పొడి చెత్త గురించి, సఫాయి కార్మికుల కొరత, ఆశా వర్కర్ల షార్ట్ ఏజ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అంగన్వాడీల గురించి మిషన్ భగీరథ వాటర్ సమస్యలను చర్చించారు. అధికారులు సమస్యను రికార్డు చేసుకొని పరిష్కారం దిశగా ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో జ్ఞానజ్యోతి, మాసాయిపేట సర్పంచ్ కృష్ణారెడ్డి, ఎం ఈ ఓ మధుసూదన్ రావు, పంచాయతీ కార్యదర్శి రాణి, లైన్ ఇన్స్పెక్టర్ చందు, లైన్మెన్ రాజుల వెంకటేష్, ఏఎన్ఎం ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వ అధికారులతో పాటు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ నాగిరెడ్డి, మాజీ ఎంపిటిసి సిద్ధిరాములు గౌడ్, మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ ఉదండపురం నర్సింలు, తొలి గ్రామసభలో అన్ని ప్రభుత్వ శాఖల సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.








