ఉగాది సంబరాలు
పినపాక
ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత, కొత్త సంవత్సర ఆరంభం గురించి వివరించారు. పాఠశాల ప్రాంగణంలో రంగవల్లులు వేయడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు పాటలు, నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
Post Views: 9








