+91 95819 05907

ఠాను నాయక్ ఉద్యమ స్పూర్తి తో గిరిజన హక్కుల కై పోరాడాలి

*రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండి రమేష్*

*బడ్జెట్ లో గిరిజనులకు 25% నిధులు కేటాయించాలి* …..
*గిరిజన సంఘం రాష్ట్ర నేత భూక్యా వీరభద్రం*

ఖమ్మం లో ఐటిడిఎ ఏర్పాటు కై 30న కలెక్టరేట్ వద్ద ధర్నా… గిరిజన సంఘం జిల్లా కమిటీ పిలుపు

నేటి గదర్ న్యూస్, వైరా:
వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు జాటోత్ ఠాను నాయక్ ఉద్యమ స్ఫూర్తితో గిరిజన హక్కుల సాధనకై పోరాడాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్ పిలుపునిచ్చారు. తాను నాయక్ 77వ వర్ధంతి సభ తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వైరా బోడెపుడి భవన్ లో జిల్లా అధ్యక్షులు బానోతు బాలాజీ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ముందుగా ఠాను నాయక్ చిత్రపటానికి తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి భూక్యా వీరభద్రం పూలమాలయసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో బండి రమేష్ మాట్లాడుతూ ఆనాడు నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా దొరలు భూస్వాముల ఎట్టి చాకిరి, దోపిడీకి వ్యతిరేకంగా వీర తెలంగాణ సాయిధరహితంగా పోరాటంలో ఠాను నాయక్ వీరోచితంగా ఉద్యమం నడపారని గుర్తు చేశారు. దేశ్ మఖ్ భూస్వాములకు వ్యతిరేకంగా పేదాలను గిరిజలను ఏకం చేసి భూములు సాధించారని, ఆనాటి భూమి కోసం భుక్తి కోసం జరిగిన పోరాటం ఫలితంగా భూ సంస్కరణలు వచ్చాయని తెలిపారు. భూస్వాములు తాను నాయక్ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి అన్నదమ్ములను జైల్లో నిర్బంధించి చివరకు వారి ప్రాణాలు తీశారని వారి వీరమరణం నేటి తరానికి ఆదర్శంగా తీసుకొని గిరిజన హక్కుల కోసం ఉద్యమించాలని కోరారు. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ నేడు కేంద్ర ప్రభుత్వం గిరిజన భూములను లాక్కోవాలని రాజ్యాంగం కల్పించిన హక్కులను రద్దు చేయాలని కుట్ర చేస్తుందని విమర్శించారు. పోడు భూములు హక్కు పత్రాల కోసం సాధించుకునే అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందని అన్నారు. పోరాడి సాధించుకున్న పేదల కోసం ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి పథకంగా మార్చి పేదలకు ఉపాధి లేకుండా కేంద్రం కుట్ర చేస్తుందని ప్రజలందరూ ఐక్యమై ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని. గిరిజన భూములు లాక్కోవాలని ప్రయత్నిస్తుందని విమర్శించారు. జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో గిరిజనులకు 25 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.ఖమ్మం జిల్లాలో గిరిజన సంక్షేమం అభివృద్ధి కోసం ఐటిడిఏ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా మాటలకే పరిమితం అయిందని గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 30న ఐటీడీఏ సాధన కోసం ఖమ్మం కలెక్టరేట్ ముందు ఆందోళన ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వైరా నియోజకవర్గం కేంద్రంలో మంజూరైన గిరిజన భవన్ పూర్తి చేయకుండా నిధులు కేటాయించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులు మోసం చేస్తుందని వెంటనే బడ్జెట్ లో గిరిజన భవన్ పూర్తి చేయడం కోసం నిధులు కేటాయించాలని లేనిపక్షంలో ఈ నెల 25న అసంపూర్తిగా ఉన్నటువంటి గిరిజన భవన్ ప్రభుత్వం పట్టించుకోకపోవటానికి నిరసనగా సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. గిరిజన హక్కుల కోసం తాను నాయక్ స్ఫూర్తితో రాబోయే కాలంలో అనేక ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో కాచిరాజుగూడెం సర్పంచ్ గా ఎన్నికైన మాళోత్ హరి నాయక్ ను ఘనంగా జిల్లా కమిటీ సన్మానం చేసింది.సమావేశంలో సంఘం జిల్లా నాయకులు భూక్యా కృష్ణ నాయక్ , గుగులోత్ పంతు నాయక్, భూక్యా విజయ,బానోతు బన్సిలాల్, బాధావత్ శ్రీనివాస్, మూడు గన్యా నాయక్ భూక్యా నాగేశ్వరరావు, కాచిరాజుగూడెం గ్రామ సర్పంచ్ మాళోతు హరినాయక్, భూక్యా కృష్ణ నాయక్,తేజవత్ కృష్ణ కాంత్, బానోతు హరిచంద్, తేజావత్ సీతారాములు, అజ్మీరా శోభన్ నాయక్,దారవత్ వినోద్ , బానోతు కిషన్ నాయక్ ,ధరావత్ నంధ్యా నాయక్, బానోతు ప్రసాద్, గుగులోతు నరేష్ నాయక్, బద్రు, సపావత్ బాలాజీ నాయక్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఠాను నాయక్ ఉద్యమ స్పూర్తి తో గిరిజన హక్కుల కై పోరాడాలి

*రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండి రమేష్* *బడ్జెట్ లో గిరిజనులకు 25% నిధులు కేటాయించాలి* ….. *గిరిజన సంఘం రాష్ట్ర నేత భూక్యా వీరభద్రం* ఖమ్మం లో ఐటిడిఎ ఏర్పాటు కై 30న

Read More »

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

 Don't Miss this News !