పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా ఆదాయ వనరులను పెంపొందించుకోవాలని, పొదుపు అలవాటు పెంచుకోవాలని కోరారు.
సంఘాల బలోపేతం ద్వారా గ్రామాభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషించాలని, ప్రతి సభ్యురాలు చురుకుగా పాల్గొని సంఘాలను మరింత బలోపేతం చేయాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో సంఘాల నిర్వహణ, రుణాల వినియోగం, తిరిగి చెల్లింపులపై అవగాహన కల్పించారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని పరిష్కార మార్గాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య సభ్యులు, సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 6








