గిన్నెలకోట వంతెన పూర్తిచేయాలని గిరిజనులు వినతి
అల్లూరి జిల్లా ఆంధ్ర-ఒడిస్సా జులై 17 నేటిగదర్ న్యూస్
సరిహద్దులో ఉన్న పెదబయలు మండలంలో వర్షాలు పడితే రాకపోకలు స్తంభిస్తాయి. ఆంధ్ర-ఒడిస్సా సరిహద్దు ప్రాంతాలన్నింటిని ఈ వంతెన కలుపుతుంది. ముంచంగిపుట్టు, జీ.మాడుగుల పాడేరు, ఇంజరీ జామిగుడ గ్రామాలు ఈ మార్గం నుంచి వెళ్లాలి. వర్షాల సమయంలో వెళ్లే అవకాశం లేదు. సాహసాలు చేసి వెళ్లాల్సి వస్తోంది. గతంలో 5-6 మంది దాటుతూ మృతి చెందారు. వంతెన నిర్మాణం పూర్తి చేయాలని గిరిజనులు కోరుతున్నారు
Post Views: 79









