ప్రజా సమస్యల పరిష్కారం కై జూలై 22వ తారీఖున స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు జరగనున్న ధర్నాను జయప్రదం చేయండి.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీనీ నెరవేర్చాలి.
సి పి ఐ యం ఎల్ మాస్ లైన్ ప్రజాపందా పార్టీ చర్ల మండల కమిటీ.
నేటి గదర్ న్యూస్,చర్ల:
చర్ల మండల పరిధిలోని చీమలపాడు,మొగలపల్లి, గొంపల్లి, తేగడ, దండుపేట కాలనీ, సి కత్తి గూడెం,లింగాపురం పాడు,పలు గ్రామాలను సిపిఐ యం ఎల్ మాస్ లైన్ ప్రజాపంధా పార్టీ చర్ల మండల నాయకత్వం గురువారం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కొండా కౌశిక్ మాట్లాడుతూ జూలై 22వ తారీఖున స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు జరగనున్న ధర్నాను జయప్రదం చేయాలని రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా ఆయా పక్షాల ప్రజలకు పిలుపునిస్తూ కరపత్రాలను పంచడం జరిగిందని ఆయన తెలిపారు. రేషన్ కార్డుల కోసం కొత్త పెన్షన్ల కోసం ఇండ్ల కోసం ఇండ్ల స్థలాల కోసం తదితర అనేక సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 100 రోజులలో ఆరు గ్యారంటీలని అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒకటి, రెండు, మాత్రమే అమలు చేశారని మిగిలిన హామీలను కూడా పూర్తి స్థాయిలో సక్రమంగా అమలు చేయాలని మాస్ లైన్ పార్టీ భావిస్తున్నదన్నారు. లేని యెడల ప్రజా ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం గురుగాక తప్పదని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం తన వాగ్దానాలన్నిటిని తక్షణమే అమలు చేయాలని జూలై 22వ తారీఖున స్థానిక తాసిల్దార్ కార్యాలయాల ముందు జరగనున్న ధర్నాను ఆయా పక్షాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఐకమత్య పోరాటాలతోనే సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకురాలు ఎస్.కె మహముద, చేన్నo మోహన్, గ్రామస్తులు కుమారి, సుశీల, నాగమణి, పున్నారావు, ప్రశాంతి, జానకమ్మ, లక్ష్మి, సమ్మక్క, తదితరులు పాల్గొన్నారు.