నేటి గద్దర్ వెంకటాపురం
ములుగు జిల్లా
వెంకటాపురం,వాజేడు, పేరూరు పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది వెంకటాపురం,వాజేడు మండలాల పరిధిలోని వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నందువలన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీస్ వారు కొన్ని సూచనలు ప్రకటించారు.
ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నందు వలన అడవులలో నుండి వచ్చే చిన్న చిన్న వాగులు ఉప్పొంగి వేగంగా ప్రవహిస్తున్నందు వలన మారుమూల ప్రాంతాల ప్రజలు వాగులు దాటే ప్రయత్నం చేయరాదు.
కొన్ని చోట్ల వాగులు రోడ్డు, బ్రిడ్జి పైకి ఎక్కి ప్రవహించే అవకాశం ఉన్నందున వాటిని కాలి నడకన దాటే ప్రయత్నం చేయరాదు.
పశువులను మేపటానికి వెళ్ళే వారు వాగులు దాటకుండా, వరద నీటికి గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని సురక్షిత ప్రదేశంలో పశువులను మేపగలరు.
ప్రస్తుతం గోదావరి ఉదృతంగా ప్రవహిస్తున్నందు వలన చేపల షికారు కు వెళ్ళేవారు, జాలర్లు చేపలు పట్టడానికి వెళ్లరాదు.
నిత్యం వర్షం పడుతున్నందువలన విద్యుత్ అంతరాయం కలిగే అవకాశం ఉన్నందు వలన అత్యవసర కమ్యూనికేషన్ కోసం మీ మొబైల్ ఫోన్‌లను ఫుల్ ఛార్జ్ పెట్టుకొని, అవకాశం ఉంటే పవర్ బ్యాంక్ లను అందుబాటులో ఉంచుకోగలరు.
ఈ భారీ వర్షాల కారణంగా గోదావరి నీరు దిగువకు ప్రవహించే అవకాశం ఉన్నందు వలన, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ మనుగడ కోసం సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు అవసరమైన వస్తువులతో అత్యవసర కిట్ ని సిద్దంగా ఉంచుకోగలరు.
మీ యొక్క విలువైన డాక్యుమెంట్ లు, వస్తువులను తడవకుండా వాటర్ ప్రూఫ్ బ్యాగ్‌లలో ఉంచండి.
అవసరమైతే తప్ప బయటకు రాకండి.
విద్యుత్ స్తంభాలు తడిసి విద్యుత్ ప్రవహించే అవకాశం ఉన్నది. కావునా విద్యుత్ స్తంభాలు మరియు పడిపోయిన విద్యుత్ లైన్ల నుండి దూరంగా ఉండండి. మరియు తడి చేతులతో విద్యుత్ పరికరాలను తాకరాదు.
తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారం నీటిని కనీసం ఒక వారం పాటు నిల్వ చేయండి.
సమీప షెల్టర్/పునరావాస కేంద్రాలపై అవగాహన కలిగియుండగలరు.
ప్రభుత్వం నిర్దేశించినప్పుడు వెంటనే సురక్షిత ప్రదేశాలకు వెళ్ళటానికి సిద్ధంగా ఉండగలరు.
ముఖ్యంగా మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోగలరు. వర్షాకాలంలో విస్తరించే వ్యాదుల పట్ల అవగాహన కలిగియుండి వాటిని నివారించడానికి దోమతెరలను ఉపయోగించండి.
వరదల సమయంలో పాము కాటు సాధారణంగా ఉంటుంది కాబట్టి పాముల పట్ల జాగ్రత్తగా ఉండగలరని, పోలీసు వారి ఈ చూచనలు పాటించి పోలీసు వారికి సహకరించగలరని ప్రజలను కోరుతున్నారు.