★ సంస్థాగతం పై కాంగ్రెస్ ఫోకస్
నేటి గద్దర్ న్యూస్ ప్రతినిధి, పూనెం సుమంత్ :కారేపల్లి మండల BRS పార్టీ కి బిగ్ షాక్ తగిలింది. శుక్రవారండీసీసీ అధ్యక్షుడు దుర్గ ప్రసాద్ ఆధ్వర్యంలో సింగరేణి మండల ఎంపీపీ మాలోత్ శకుంతల చీమల పాడు సర్పంచ్ మాలోత్ కిషోర్ లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైరా క్యాంపు కార్యాలయంలో జిల్లా డీసీసీ అధ్యక్షులు దుర్గ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. భవిష్యత్తు కూడా కాంగ్రెస్ పార్టీదే అని జోస్యం చెప్పారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమన్నారు.
Post Views: 231