◆జిల్లా ఎస్ పి డా. శబరిష్ ఐపిఎస్
నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, జులై 20:
చత్తిస్ ఘఢ్ & తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీస్ పార్టీలు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ రోజు అనగా తేదీ 20.07.2024 ఉదయం 07.00 గంటల ప్రాంతంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా ఎల్మిడి PS పరిధిలోని సీమల దొడ్డి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉరవసారి గుట్ట సమీపంలో దాదాపు 20 మంది నిషేధిత CPI (మావోయిస్ట్) తీవ్రవాదులు ఆలివ్ గ్రీన్ యూనిఫారం తుపాకులను ధరించి పోలీస్ వారి పై కాల్పులు జరిపడం జరిగింది. పోలీసులను చంపాలనే ఉద్దేశంతో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూనే ఉండగా కాల్పులు ఆపాలని, ఆయుధాలు వదిలి లొంగిపోవాలని విజ్ఞప్తి చేసినప్పటికీ, సీపీఐ మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే ఉండగా ఆత్మరక్షణ కోసం మా పోలీస్ పార్టీ వారు కూడా ఎదురు కాల్పులు జరుపడం జరిగింది. ఈ ఎదురుకాల్పులు 15 నిమిషాలకు పైగా కొనసాగాయి, అవతలి వైపు నుండి కాల్పులు ఆగిపోగా ఆ ప్రాంతాన్ని తనిఖీ చేయగా ఒక తుపాకీ గాయాలతో చనిపోయిన మావోయిస్టు క్యాడర్ ను కనుగొనగా సంఘటన స్థలం నుండి ఒక 9 mm కార్బైన్ తుపాకీ , తూటాలు మందుగుండు సామగ్రి, డిటోనేటర్, CPI మావోయిస్టు సాహిత్యం మరియు కిట్ బ్యాగులు, ఇతర రోజువారీ వినియోగ వస్తువులు లభించాయి. ఇట్టి సంఘటన బీజపూర్ జిల్లా ఎల్మిడి పి ఏస్ పరిధిలో జరిగినందున అట్టి పి ఎస్ లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించడం జరిగింది.