నేటి గదర్ వెబ్ డెస్క్:
ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం రేపు ఒడిస్సా- భువనేశ్వర్ మధ్య తీరాన్ని తాకుతుంది.గాలులు గంటకి 50 కిలోమీటర్లు వేగం తో వీస్తాయి. ఈ రోజు రాత్రి, కృష్ణా, గుంటూరు, విజయవాడ, ఏలూరు, ప్రకాశం,పల్నాడు జిల్లాలో కొన్ని చోట్ల మాత్రమే భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదవుతాయి..
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం జిల్లా, అల్లూరిసీతారామరాజు జిల్లా, అనకాపల్లి, అరకు, పాడేరు వివిధ భాగాల్లో మోస్తారు వర్షాలు నమోదవుతాయి.ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జైశంకర్భూపాల్పల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్ ఖమ్మం, భద్రాద్రికొత్త గూడెం,, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, వివిధ జిల్లాలో మోస్తారునుంచి భారీ వర్షాలు ఉరుములు మెరుపుల తో నమోదవుతాయి.
తిరుపతి, చిత్తూరు అన్నమయ్యా, సత్యసాయి, కడప, కర్నూల్, నంద్యాల, వివిధ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే మోస్తారు వర్షాలు ఉంటాయి. రేపు కూడా వర్షాలు కొనసాగుతాయి. రేపు మధ్యాహ్నం సమయం నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయి.జులై 21 నుంచి వర్షాలు తగ్గుముఖంపడతాయి.