– వర్షాల నేపథ్యంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి
– సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
– ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
నేటి గదర్, జూలై 20,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశీ, 9052354516 :
ఎడతెరపిలేని వర్షంలో ఎమ్మెల్యే భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రజల సమస్య లను తెలుసుకునేందుకు భద్రాచలం పట్టణంలోని పలు కాలనీలలో సంబంధిత అధికారులతో కలిసి పర్యటించారు. శనివారం పట్టణంలోని కాలనీలో ప్రజలు ఎడతెరపిలేని వర్షాలతో పాటు తల సమస్యలతో సతమతమవుతున్నారని స్థానిక నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు దృష్టికి తీసుకోవడంతో ఎమ్మెల్యే వెంకట్రావు ఆయా ఎడతెరపు లేని వర్షంలో గొడుగు పట్టుకుని ఆయా కాలనీలో పర్యటించి ప్రత్యక్షంగా సమస్యాత్మక ప్రదేశాలను పరిశీలించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ఆయన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అధికారులకు ఆదేశించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. అనంతరం గోదావరి వరద ఉధృతిపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోతట్టు, ముంపు ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద తీవ్రతను బట్టి అధికారుల సూచించిన సమయంలో పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. మండల సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై సకాలంలో స్పందిస్తూ.. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పనిచేస్తున్న ఎమ్మెల్యే వెంకట్రావు ను ప్రజలు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రత్నం రమాకాంత్ కొండిశెట్టి కృష్ణమూర్తి, అరికెల తిరుపతిరావు, నర్రా రాము, చింతాడి చిట్టిబాబు, మామిడి పుల్లారావు, భీమవరపు వెంకటరెడ్డి, చెగొండి శ్రీనివాస్, ఒగ్గే రమణా, యూత్ నాయకులు గాడి విజయ్, మాచినేని భాను, పుల్లగిరి నాగేంద్ర, బెతంపుడి భరత్, పిట్టల రాజు, జమిర్, మహిళ నాయకురాలు సాయి కుమారి, పిట్టల లక్ష్మి కాంతం తదితరులు పాల్గొన్నారు.