– నాయకులు సైతం ప్రజలకు సహాయ సహకారాలను అందించాలి
– సిపిఎం పార్టీ బూర్గంపాడు మండలం అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు
నేటి గదర్, జూలై 20,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశీ, 9052354516 :
గోదావరి వరదల నేపథ్యంలో ముంపు ప్రభావిత, లోతట్టు ప్రాంతాల ప్రజలను పరిస్థితుల మేరకు పునరావాస కేంద్రాలకు తరలించాలని సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో బూర్గంపాడు మండల పరిధిలోని లోతట్టు, వరద ముంపు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సిపిఎం పార్టీ కోరుతుందన్నారు. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేసి, పునరావస్థ కేంద్రాలకు తరలించాల్సిన బాధ్యత అధికారుల పైన ఉందని అదేవిధంగా రాజకీయ పార్టీ నాయకులు కూడా లోతంటూ ప్రజలకు సహకరంచే విధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.