◆ఇసుక లారీలతో ధ్వంసమైన రోడ్డు…
◆ఇసుక కాంట్రాక్టర్లపై విరుచుక పడుతున్న ప్రజలు…
◆అశ్వాపురం నుండి చింతిర్యాల రోడ్డుకు మోక్షం కలిగేనా..?
◆ఎమ్మెల్యే దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు…
నేటి గదర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి అశ్వాపురం జులై 20:
అశ్వాపురం మండలం పరిధిలోని చింతిర్యాల క్రాస్ రోడ్ నుండి సుమారు 6-7 గ్రామాలను కలుపుకుంటూ పోయే ప్రధాన రహదారి చింతిర్యాల రోడ్డు దుస్థితి అధ్వానంగా మారింది.ఈ రోడ్ పై గత ప్రభుత్వ పాలనలో కోట్ల రూపాయల ఇసుక వ్యాపారం జరిగింది. కానీ ఇసుక కాంట్రాక్టర్లు కోట్లు దండుకొని వెళ్లిపోయారే తప్ప ఈ రోడ్డును పట్టించుకోలేదని ప్రజలు మండిపడుతున్నారు.ఇసుక రేజింగ్ కాంట్రాక్టర్ ధనార్జనే ధ్యేయంగా కోట్ల రూపాయలను దండుకున్నారే తప్ప ప్రజా రవాణా రోడ్డును మరమ్మత్తులు కూడా చేయకుండా వెళ్లిపోయారని పలువురు ఆరోపిస్తున్నారు.కానీ స్థానిక ప్రజలకు మాత్రం మిగిలింది గోతులతో కూడిన ధ్వంసమైన రోడ్డు మాత్రమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రసవంతో కలిగిన ఆడ బిడ్డను తీసుకెళ్లాలంటే దారి మధ్యలోనే ప్రసవించే పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రవాణా రాకపోకలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని,చివరకు ప్రజల ప్రయాణ ప్రయాణించాలంటే కనీసం ఆటోలు కూడా తిరగలేని దుస్థితి నెలకొందని పలువురు ఆరోపిస్తున్నారు.అంగన్ వాడికి పోయే చిన్నారులు,స్కూల్ విద్యార్థులు, ప్రాథమిక వైద్యశాలకు పోయే రోగులు సైతం రోడ్డు మీద నడిచిపోయే పరిస్థితి లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చింతిర్యాల కాలనీకు సంబంధించిన ప్రజల రవాణా,రాకపోకలకు రహదారి అత్యంత దుర్భరంగా ఉందని ఈ రహదారిపై స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.