నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు.
ప్రిలిమ్స్ లో సీటు సాధించిన ఖమ్మం జిల్లా వాసి సాయి అలేఖ్య. యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో కూడా అత్యధిక మార్కుల సాధించిన అలేఖ్య . ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు లక్ష రూపాయలు బహుమతి ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆల్ ఇండియా లెవెల్ లో 938వ ర్యాంకు సాధించిన అలేఖ్య సాయి అలేఖ్యను అభినందించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల , పొంగులేటి.
పొరుగు రాష్ట్రాల నుంచే ఇప్పటివరకు ఎక్కువమంది ఐఏఎస్ ఐపీఎస్ లు కొట్టడం జరుగుతుంది కానీ సాయి అలేఖ్య మన తెలంగాణ* రాష్ట్రం ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందాపురం గ్రామంలో పుట్టి ఆల్ ఇండియా లెవెల్ లో మంచి ర్యాంకు సాధించి పలువురు ప్రముఖులచే అభినందనలు వెల్లువెత్తునాయి. సాయి అలేఖ్య తండ్రి మధిర టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ప్రకాష్ రావు గారి ఏకైక కుమార్తె ప్రకాష్ రావు గారు విధులు నిర్వహిస్తూ వారి కుమార్తెను ఐఏఎస్, ఐపీఎస్ కొట్టాలనే పట్టుదలతో ఫస్ట్ నుంచి కూడా చదువును వెనకాడకుండా ఉన్నత విద్యలను చదివించి వారి కళ నెరవేర్చే విధంగా వారి పాప సాయి అలేఖ్య మన ముందు ఉండటం విశేషం. అలాగే ఈ సాయి అలేఖ్య లాగానే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువమంది చదువుకొని ఐఏఎస్ ,ఐపీఎస్ కొట్టాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రోత్సాహ బహుమతులు అందజేసి ఎంతో ఉత్తేజపరిచి వారికి ప్రభుత్వం వారికి అన్ని రకాలుగా అండదండలు ఉంటాయని సభాముఖంగా తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు మరియు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.