+91 95819 05907

సింగరేణి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ రిక్రూట్మెంట్లో అక్రమాలంటా..?

■సమత జడ్జి మెంట్ ప్రకారమే నియామకాలు జరగాలి…

■ఏజెన్సీ ప్రాంతంలో 1997 సమత జడ్జిమెంట్ ను అమలు చేయాలని చట్టం చెపుతున్నా పట్టించుకోని సింగరేణి అధికారులు…

■సుప్రీం కోర్టు ఆర్డర్ ప్రకారం ఆదివాసీలకే ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలి…

■సుప్రీం కోర్టు తీర్పు కు వ్యతిరేకంగా నియామకాలు జరిగితే సంబంధిత సింగరేణి అధికారులపై న్యాయ స్థానాలను ఆశ్రయిస్తాం…ఆదివాసీ జేఏసీ.

నేటి గదర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జులై 20:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని మణుగూరు సింగరేణి పాఠశాలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా స్థానిక ఆదివాసీలకు, సింగరేణి భూ నిర్వాసిత యువతి యువకులకు మాత్రమే ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయి.సమత జడ్జిమెంట్ (1997) చట్ట ప్రకారం అమలు చేస్తూ ఆదివాసీలకు,సింగరేణి భూ నిర్వాసిత యువతి యువకులకు మాత్రమే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు,పర్మినెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చెబుతున్న స్థానిక సింగరేణి అధికారులు మాత్రం ఏ చట్టాలను పట్టించుకోకుండా వారికి నచ్చినట్లుగా ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని, గతంలో (12-07-2024) న డెమో ఇంటర్వ్యూలో కేవలం దొడ్డిదారిన సెటిల్మెంట్ చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే డెమో నిర్వహించడం జరిగిందని,ఆరోపణలు వెల్లువెత్తగా జిల్లా యంత్రాంగం జ్యోక్యం చేసుకోవడంతో నిర్వహించిన డెమోలను రద్దు చేశారు.కానీ అధికారం హోదా ఉన్నంత సేపు బుద్ధి మారదన్నట్లుగా మళ్ళీ వారి అభ్యర్థులకే ఇవ్వడం కోసం రహస్య చర్చలు జరుపుతూ,ఆదివాసీలకు మొండిచెయ్యి చూపిస్తున్నారని ఆదివాసీ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అందు చేతనే నాడు సెలెక్టెడ్ అభ్యర్థుల వివరాలు రహస్యంగా ఉంచారని పలువురు చర్చించుకుంటున్నారని వారు వాపోయారు.ఈ విధముగా డబ్బుకు అమ్ముకుంటే విద్యార్థుల చదువులు ప్రశ్నార్థకమేనని ఆరోపిస్తున్నారు.మళ్ళీ ఆ ఇద్దరి సమక్షంలోనే డేమోలు నిర్వహిస్తే, విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని మండిపడ్డారు.ఆ ఇద్దరి ప్రమేయం లేకుండా ఇతర సింగరేణి ఉన్నత స్థాయి అధికారుల సమక్షంలో సమత జడ్జిమెంట్ ప్రకారం నిర్వహించాలని కోరారు.ఏజెన్సీ చట్టాలకు అనర్హులైనటువంటి గిరిజనేతరుల దరఖాస్తులు స్వీకరించకూడదని మణుగూరు ఆదివాసీ జేఏసీ తరపున సింగరేణి ఎస్ఓ టు జిఎం కు వినతి పత్రాన్ని అందజేశారు.చట్ట ప్రకారం అమలు చేయని పక్షాన సంబంధిత సింగరేణి అధికారులపై న్యాయ స్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మణుగూరు ఆదివాసీ జేఏసీ అధ్యక్షుడు సోడే రవికుమార్ దొర, ఉపాధ్యక్షులు పూనెం రమేష్ దొర, గనిబోయిన ముత్తయ్య, కార్యదర్శి పూనెం నాగరాజు,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం ఇంటింటా సర్వే జరిగింది. సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి,

Read More »

రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు..

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు మండలం రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు నిర్వహించడం జరిగింది ఇట్టి తనికీ లలో 1)గుగులోతు స్వరూప W/o శ్రీను 2)భూక్య

Read More »

 Don't Miss this News !