సిల్వర్ రాజేష్ (నేటి గదర్ ప్రతినిధి మెదక్)
శనివారం రామాయంపేట లో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలసి పర్యటించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని ఆదేశించిన మేరకు స్థల పరిశీలనలో భాగంగా రావడం జరిగిందని చెప్పారు రామాయంపేట మున్సిపాలిటీలో మూడు లొకేషన్లలో స్థల పరిశీలన చేయగా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టిన నేషనల్ హైవే పక్కన, మరొకటి కోమటిపల్లి రోడ్డు దగ్గరలో ఉన్న భూమికి సంబంధించి పరిశీలించినట్లు చెప్పారు 20 ఎకరాలు అవసరం ఉన్న మేరకు ఎక్కడ అణువుగా ఉంటే ఆ స్థలానికి సంబంధించి సంబంధిత తాసిల్దార్ రజని, ఆర్ అండ్ బి.ఈ సర్దార్ సింగ్ ను ప్రతిపాదన సిద్ధం చేసి అందించాలని అన్నారు. బీసీ ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని సంక్షేమ శాఖలు విద్యార్థులకు ఒకే చోట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టినట్లయితే భేద భావన అభిప్రాయం పోతుందని సౌకర్యాలు కల్పన కూడా సులభతరం అవుతాయని ప్రభుత్వ సూచనల మేరకు స్థల పరిశీలన చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి E.E సర్దార్ సింగ్,తాసిల్దార్ రజని సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.