★ఏళ్ల తరబడి వరద పడుతున్న బీసుందరయ్య నగర్, వినాయక నగర్,మరో 6 కాలనీలు
★ వరదలు వస్తే తప్ప అటువైపు చూడని పాలకులు ,అధికారులు
★ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వేలాదిమంది ప్రజలకు అవస్థలు
★ వారి కష్టాలు ఎవరికి పట్టేను?
★ ఇకనైనా పాలకులు సింగరేణి యాజమాన్యం పట్టించుకోవాలి
✍️కొత్త దామోదర్ గౌడ్,నేటి గదర్ ప్రతినిధి
నేటి గదర్ న్యూస్ (మణుగూరు): నెలా కాదు …రెండు నెలలు కాదు.. సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు… ఏళ్ల తరబడి వర్షాకాలం వచ్చిందంటే చిన్న పెద్ద తేడా లేకుండా గజ,గజ వణకాల్సిందే. వందల కోట్ల రూపాయల ఆదాయం పొందుతూ మణుగూరు సింగరేణికి మాత్రం వీరి కష్టాలు పట్టవు. మణుగూరు పట్టణంలో ని సింగరేణి ఉపరితల గనుల మూలంగా వర్షాకాలం వేలాది ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.దీనిపై నేటి గద్దర్ ప్రత్యేక కథనం.
మణుగూరు మండలం, మున్సిపాలిటీ పరిధిలోని విప్పల సింగారం,మెదర బస్తీ, గాంధీ నగర్,పైలట్ కాలనీ, సుందరయ్య నగర్,భగత్ సింగ్ నగర్,కాళీ మాత ఏరియా ఈ ప్రాంతాలకు వర్షాకాలం వచ్చిందంటే గజగజ వణకాల్సిందే. మణుగూరు సింగరేణి ఉపరితల గనుల నుంచి వచ్చే వరద నీరు సింగారం చెరువులో చేరుతుంది. ఆయా ఓసీల నుండి అధిక ప్రవాహం రావడంతో ప్రతి సంవత్సరం చెరువు తెగడం అక్కడి నుండి వరద నీరు మణుగూరు పట్టణంలోని ప్రధాన ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ఈ సమస్య గత కొన్ని సంవత్సరాల నుండి ఉన్న పట్టించుకునే నాథుడు మాత్రం కరువయ్యారు. ఈ వరదలతో ఆయా ప్రాంతాలలో వృద్ధులు పిల్లలు మహిళలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ప్రతి సంవత్సరం లక్షల్లో నష్టం వాటిల్లుతుంది. అలాగే నీరు నిల్వ ఉండడంతో అంటివ్యాధుల భారిన పడుతున్నారు. వేలాదిమంది ప్రజలు అవస్థలు పడుతున్న అందుకు కారణమైన సింగరేణికి మాత్రం ఎలాంటి సోయి లేకుండా పోయింది. మండల అధికార యంత్రాంగం మాత్రం వర్షాలు కురిచే సమయంలో చూపిన హడావుడి అనంతరం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే వారి కష్టాలు దేవుడు ఎరగాల్సిందే. ఇకనైనా పాలకులు దృష్టి సారించి ఆ యా కాలనీలోకి వరద ప్రవాహం రాకుండా కరకట్ట నిర్మాణం చేపట్టాలని మనగూరు పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు సింగరేణి అధికారులు ఎలా స్పందిస్తారో ఎదురుచూడాల్సిందే.