నేటి గదర్ కరకగూడెం:మండల పరిధిలోని చిరుమళ్ళ,బర్లగూడెం, సమత్ బట్టుపల్లి,కన్నాయిగూడెం గ్రామలలోని బ్రిడ్జిలను భద్రాచలం డిఎల్ పిఓ సుధీర్ కుమార్,మండల స్పెషల్ అధికారి మైనింగ్ ఏడి దినేష్ కుమార్ పర్యటించి వర్షాలకు కోతకు గురైన బ్రిడ్జిలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజులలో భారీ వర్షాలు ఎక్కవగా కురిసే అవకాశం ఉన్నందున మండల అధికారులు ప్రజలకు అందుబాటు ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు.గ్రామలలో రాకపోకలు నిల్వకుండా చూడాలని అన్నారు.వర్షాలకు వర్షపు నీరు నిల్వకుండా చుస్తు సీజనల్ వ్యాధుల పట్ల కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉంటు ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ దేవ వరకుమార్, గ్రామపంచాయతిల సెక్రటరీలు పాల్గొన్నారు.
Post Views: 143