★కాంగ్రెస్ పార్టీ మండల సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
నేటి గదర్ కరకగూడెం:భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అన్నారు.
ఈ సందర్భంగా అయన విలేకర్లతో మాట్లాడుతూ
రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించిందని అన్నారు.
కావున మండల ప్రజలు ఎవరు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు.
అలాగే ఏదైనా సంఘటన జరిగితే ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రజలు ఈ నెంబర్ (9347149313) కు సమాచారం అందించాలని తెలిపారు.
Post Views: 70