నేటి గదర్ న్యూస్ , జులై 21 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
కూసుమంచి మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూసుమంచి బీజేపీ నాయకుడు గుండా ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ బృందం పరిశీలించింది.. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు గుండా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ…కూసుమంచి మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్నా డబుల్ బెడ్రూం ఇల్లు ఇలా నిర్లక్ష్యం చేయడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది అన్నారు… డబుల్ బెడ్రూం ఇళ్లలోకి చెత్తను తరలించడం కోసం పంచాయితి పారిశుధ్య సిబ్బందిను కూడ ఇంతవరకు అటువైపు కు పంపించలేదు అని అన్నారు…
కనీసం నడవటానికి సరైన దారి లేదు పూర్తిగా బురదమయం అయిందని.. ఇప్పటివరకు కనీసం శానిటేషన్ లో భాగంగా బ్లీచింగ్ పౌడర్ కూడ చల్లిన పాపాన పోలేదు అన్నారు.. డబుల్ బెడ్రూం ఇళ్ళల్లో నివాసం ఉంటున్న వారు మనుషులు కాదనుకుంటున్నారా అని ప్రశ్నించారు…
ఈ సందర్భంగా వారు కొన్ని
ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు..
* వారంలో కనీసం మూడు రోజులు పంచాయితీ సిబ్బంది తమ ప్రాంతాన్ని సందర్శించాలని
* సీసీ రోడ్లు నిర్మాణం చేయాలి అని
* ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి అని
* రెండు బోర్లు ఏర్పాటు చేసి, తాగు నీటి సమస్యను నివారించాలని
* ఇండ్ల పట్టాలు అందచేయాలని
* అంగన్వాడి కేంద్రం ఏర్పాటు చేయాలి అని
* అప్పుడే వర్షాలకు కురుస్తున్న ఇళ్లను బాగు చెపించాలి.
వంటి డిమాండ్లను భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది … డబుల్ బెడ్రూం వాసుల తరఫున పోరాటం చేస్తం అని చెప్పటం జరిగినది.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వద్దెంపూడి నరేష్, యువజన మోర్చ మండల అధ్యక్షులు మంద చంద్ర శేఖర్ గౌడ్, పార్టీ నాయకులు శంకర్ నాయక్, బద్దం వెంకట్ రెడ్డి, దుర్గా రావు, గుండా విజయ్ పాల్ రెడ్డి, పిట్టల వేణు తదితరులు పాల్గొన్నారు.