నేటి గదర్ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి
అమెరికా అధ్యక్ష రేసు నుంచి డెమోక్రటిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలిగారు. ఆయన అభ్యర్థిత్వంపై ఇటీవల సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతోపాటు ట్రంప్ తో జరిగిన చర్చలో బైడెన్ ఘోరంగా వైఫల్యం చెందారు. దీంతో అధ్యక్ష రేసు నుంచి వైదొలగక తప్పని పరిస్థితి ఎదురైంది. పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు నిన్న బైడెన్ ప్రకటించారు.ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు లేఖ రాశారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు.
Post Views: 45