నేటి గదర్ న్యూస్ , జులై 22 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
ఉపాధ్యాయులు కొరతతో పాఠాలు చెప్పేవారు లేరని రోడ్ ఎక్కి విద్యార్దులు వారి తల్లిదండ్రులు ఆందోళన చేశారు.. వివరాలు ఇలా ఉన్నాయి… కూసుమంచి మండలం పాలేరు గ్రామంలోని యుపిఎస్ పాఠశాలలో 2022 వరకు 1 నుండి 7 వ తరగతి వరకే బోధన పరిమితమై ఉండేది. గత ఏడాది ఇదే పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అప్పటి నుండి 1 నుండి పదవ తరగతి వరకూ బోధన జరుగుతుంది. ఇప్పుడు ఆ పాఠశాలలో దాదాపు 225 మంది విద్యార్థులు ఉన్నారు.. వారిలో హై స్కూల్ విద్యార్థులు 115 మంది ఉన్నారు.. ఇంతమంది విద్యార్థులు ఉన్న ఇద్దరు మాత్రమే టీచర్లు ఉన్నారంటే అతిశయోక్తి.. గత ఏడాది కూడా అరకొర ఉపాధ్యాయులతో , ఎస్జిటి టీచర్ల తో బోధనను సాగించారు. ఎస్జీటీ టీచర్లతో హై స్కూల్ విద్యార్థులకు బోధన జరపడం వల్ల విద్యార్దులకు నష్టం కలిగించే అవకాశం లేకపోలేదు. అయినా ఈ ఏడాది కూడా హై స్కూల్ టీచర్లు లేకుండానే పాఠశాలలో బోధన జరుగుతుండడంతో సోమవారం పాఠశాల విద్యార్దులు వారి తల్లిదండ్రులు ,విద్యార్థి సంఘాలు,రాజకీయ నాయకులతో కలిసి రోడ్ పై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా విద్యార్దులు ,తల్లిదండ్రులు సరిపడిన ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై నేటి గదర్ న్యూస్ రిపోర్టర్ మండల విద్యా శాఖ అధికారిని సంప్రదించగా స్పందించారు… ఎంఈఓ రామాచారి మాట్లాడుతూ.. గత ఏడాది యుపిఎస్ గా ఉన్న స్కూల్ ను అప్గ్రేడ్ చేయడం జరిగింది.. ఇటీవల జరిగిన టీచర్ల బదిలీలో ఈ ఎవరు కూడా పాలేరు పాఠశాలను ఎంచుకోలేదు.. ప్రస్తుతానికి ఎస్జిటీ టీచర్లను ,ఇతర పాఠశాలల నుండి ఉపాధ్యాయులను రప్పించి పాటలు చెప్పించనున్నట్లు తెలిపారు.. ఉపాధ్యాయుల కొరతపై పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు..