◆గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుందని ప్రజల అప్రమత్తంగా ఉండాలని చేపల వేటకు వెళ్లొద్దని సూచన చేశారు.
నేటి గద్దర్ న్యూస్,వాజేడు:
ములుగు జిల్లా వాజేడు మండలం గోదావరి పరివాహక ప్రాంతంలో మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క
పర్యటనలో భాగంగా బొగత జలపాతం కేంద్రంగా ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో క్యాంటీన్ ప్రారంభించినట్టు తెలిపారు.
తెలంగాణ నయాగరా బొగత జలపాతం అందాలు తిలకించారు.చత్తీస్గడ్, మహారాష్ట్ర, తెలంగాణ పలు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో పర్యటకులు ఈ ప్రకృతి రమణీయమైన అందాలను తిలకించేందుకు తండోపతండాలుగా తరలివస్తున్న వారికి ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ ఉపయోగపడుతుందని తద్వారా మహిళలకు స్వశక్తిగా ఎదిగే అవకాశం ఉందని మంత్రి సీతక్క అన్నారు.
గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుందని,
గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేటకు వెళ్లొద్దని, గడ్డలకు, కాయలకు, కొండలెక్కడం, ఆవులు, మేకలు, మేపటం అడవికి వెళ్లడం లాంటి పనులను, చేయకూడదని మంత్రి సీతక్క ప్రజలకు తెలియజేశారు. ములుగు జిల్లా అధికారులు కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఐ టి డి పి ఓ సంబంధిత అధికారులు ఫ్లడ్ ఏరియాలో ప్రాంతంలో ఆప్రమత్తంగా ఉన్నారని, ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారని మంత్రి సీతక్క అన్నారు.