+91 95819 05907

ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలి:జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

*.ప్రభుత్వ లక్ష్యాలు నెరవేర్చాలి అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ సమీక్షలు నిర్వహిస్తూ పనుల్లో వేగం పెంచాలి.వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ పథకాల పనుల పురోగతి పై సమీక్ష నిర్వహించిన
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.*
సిల్వర్ రాజేష్ (నేటి గదర్ ప్రతినిధి మెదక్)

అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.సోమవారం ఐ.డి.ఓ.సి కార్యాలయపు సమావేశపు హాలులో ప్రజావాణి నిర్వహించిన అనంతరం వివిధ శాఖల అధికారులతో చేపట్టిన పనులు, పురోగతి, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు పరిష్కారం జిల్లా అధికారులు సంబంధిత శాఖల పనితీరు రివ్యూలు క్షేత్రస్థాయి పర్యటనలు,డెంగ్యూ మలేరియా వ్యాధులు సాగకుండా ప్రజలను రక్షించడం,వన మహోత్సవ కార్యక్రమం,మహిళా శక్తి పథకం,మన ఊరు మనబడి, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎడ్యుకేషన్,వాటర్ సప్లై శానిటేషన్ తదితర అంశాలుమౌలికసదుపాయాలు కల్పన, శాఖాపరమై అన్ని శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో సమస్యను పరిష్కరించాలని జిల్లా అధికారులు ఆయా శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పర్యటించి లోటుపాట్లను సవరించుకొని ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలన్నారు డెంగ్యూ మలేరియా ప్రజలకు సోకకుండా పరిసరాల పరిశుభ్రత పై దృష్టి సారించాలన్నారు ఇందుకు గాను ఆశ ఏఎన్ఎం, పంచాయతీ సెక్రెటరీ నిబద్ధతతో పనిచేయలన్నారు వనమహోత్సవ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుందని లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు మహిళా శక్తి పథకం పగడ్బందీగా అమలు చేయాలని చెప్పారు. మన ఊరు మనబడి కార్యక్రమాల ద్వారా చేపట్టిన పనులు పూర్తి చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన గుణాత్మక విద్యను అందించాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి స్థల పరిశీలన సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా విషయంలోఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులు ఆదేశించారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు నూరు శాతం అందించినప్పుడే ఉత్తమ పాలన అందించిన వారమవుతామని కలెక్టర్ అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు సంబంధిత వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇద్దరు వ్యక్తులను గొడ్డెలతో నరికి హత్య చేసిన మావోయిస్టు లు

ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీ గ్రామంలో దారుణ హత్య పోలీసుల ఇన్ ఫార్మర్ నేపంతో ఇద్దరు వ్యక్తులు ఉయిక రమేష్, ఉయిక అర్జున్ లను రాత్రి 11 గంటల సమయంలో గొడ్డెలతో

Read More »

ప్రశ్నించే గొంతుకలను కాపాడుకుందాం….అమరుడు పురుషోత్తం సంస్మరణ సభ

*23-11-2024 (చిన్న తాండ్రపాడు )* ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష సాధన చుట్టూ మన కార్యచరణ ఉండాలి అలా జీవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా జీవించిన వారిలో ఆచరించి చూపిన

Read More »

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

 Don't Miss this News !