రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 22:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో వర్షాభావ పరిస్థితుల నిమిత్తం మున్సిపల్ చేర్మెన్ పల్లె జితేందర్ గౌడ్ కు సోమవారం రోజు ఉదయం కాలనీవాసులు మట్టి రోడ్డు విషయంలో విజ్ఞప్తి చేశారు.మాకు వర్షాలు పడటం వల్ల రోడ్లు గుంతల మాయం అయినది.దీనికి మరమ్మతులు చేపట్టాలని ఆయనను కోరారు.ఈ విషయంలో స్పందించిన చైర్మన్ మరియు మున్సిపల్ కమిషనర్ ఎం. దేవేందర్ మేనేజర్ ఎం.శ్రీనివాస్ కెసిఆర్ కాలనీ అధ్యక్ష ఉపాధ్యక్ష కార్యవర్గ సభ్యులతో కలిసి కెసిఆర్ కాలనీ నుండి ప్రభుత్వ హాస్పిటల్ వరకు నడుస్తూ రోడ్లో ఏర్పడిన గుంతలను వర్క్ ఇన్స్పెక్టర్ తో గుర్తించి వాటి యొక్క గుంతలలో మొరం వేయించడానికి చైర్మన్ చర్యలు చేపట్టినారు.చైర్మన్ మా యొక్క విజ్ఞప్తి మేరకు స్పందించి మట్టి రోడ్డు వేయిస్తున్నందుకు కాలనీవాసులు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Post Views: 68