★ పంచాయతీ అధికారులు దృష్టి సారించాలి అంటున్న
గ్రామస్తులు
★ నిధులు లేవు పనులు ఎట్ల చేయాలి అని అంటున్నారా?
నేటి గదర్ న్యూస్ జులై23: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాస రావు.
వైరా మండలం ముసలిమడుగు గ్రామంలో గ్రామపంచాయతీ నిర్వహణపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైంది.సర్పంచుల పదవీకాలం పూర్తి కావడంతో పంచాయతీ కార్యదర్శి రోజు వారికి కేటాయించిన గ్రామానికి వెళ్లి పారిశుద్ధ్యం తాగునీటి సరఫరా ట్రాక్టర్ పనితీరును పరిశీలించాల్చి ఉన్నది, కానీ పంచాయతీ కార్యదర్శి, అధికారులు చుట్టపు చూపు వలే వస్తుండటంతో సమస్యలు ఎవరికి చెప్పుకో వాలో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రస్తుత వర్షాకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శి కి, గ్రామ కాంగ్రెస్ నాయకుడు కేతవరపు వెంకటేశ్వర్లు పారిశుధ్యం పై ఫోన్లో వివరణ అడగగా గ్రామపంచాయతీకి సంబంధించి ఫండ్స్ లేదు నేనేమీ చేయలేను. అది ప్రజలకు తెలుసు, ప్రభుత్వ యంత్రాంగానికి తెలుసు.అని అంటున్నాడు అని చెప్పడం జరిగింది.గ్రామ ప్రజలు మాట్లాడుతూ, రోడ్లకు ఇరుపక్కల గడ్డి విపరీతంగా పెరిగింది. ఈది లైట్లు వేయటం లేదు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు, 15 రోజులకు ఒకసారి కూడా చెత్తను సేకరించడం లేదు. పారిశుధ్యం పై ఏమాత్రం శ్రద్ధ కనిపించట్లేదు. దీనిపైఉన్నత అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకొనగలరని ప్రజలు కోరుతున్నారు.