★ఏ.ఐ.టీ.యూ.సీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ , జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా
నేటి గదర్ న్యూస్, హైదరాబాద్:ఈ నెల
26న శుక్రవారం ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ ధర్నా వద్ద ఏ.ఐ.టి.యూ.సి ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల సాధనకై నిర్వహించే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏ.ఐ.టీ.యూ.సి ఉప ప్రధాన కార్యదర్శి మరియు జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. నరసింహ, కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఎన్ హెచ్ ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా పిలుపునిచ్చారు. మంగళవారం యూనియన్ ఎన్ హెచ్ ఎం ప్రతినిధులతో చర్చ కార్యక్రమం ఫోన్లో నిర్వహించడం జరిగింది. జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ ఎన్హెచ్ఎంలో వివిధ బాగాల్లో 78 క్యాడర్స్ లో పని చేస్తున్న ఉద్యోగులను అనేక ఇబ్బందులు ఎదుర్కొంటునన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఆల్ క్యాడర్స్ ఉద్యోగుల సమస్యల శాశ్వత పరిష్కారం కొరుతూ ఈ నెల 26 న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.