★గ్రామాలలో దోమలు వ్యాప్తి చెందకుండా అవగాహన…
★విష జ్వరాలు బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి…
నేటి గదర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జులై 23:
మణుగూరు మండల వ్యాప్తంగా పలు గ్రామ పంచాయతీలలో విస్తృతంగా ఇంటింటికి తిరుగుతూ విష జ్వరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో తేళ్లూరి శ్రీనివాసరావు,ఎంపీఓ పల్నాటి వెంకటేశ్వరరావు ప్రజలకు అవగాహన కల్పించారు.దమ్మకపేట,సాంబాయిగూడెం, రామానుజవరం,తిర్లాపురం,సమితి సింగారం గ్రామపంచాయతీలోని పలు గ్రామాలను సందర్శించిన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ఇటీవల కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.దోమల వ్యాప్తిని నివారించడానికి ఇంటింటా పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఎంపీడీవో,ఎంపీఓ ఇంటి సమీపంలో పగిలిపోయిన కుండలు,కొబ్బరి బోండాలు, ప్లాస్టిక్ వస్తువులు,సీసాలు,టైర్లలో నీటి నిల్వలు ఉంచకుండా చూడాలని సూచించారు.నీటి నిలువలు ఉంటే మలేరియా డెంగు విషజ్వరాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.పలు గ్రామపంచాయతీ కార్యదర్శులకు ఆయా పంచాయతీలోని గ్రామాల్లో ఎక్కడ నీరు నిలువ ఉన్న ప్రతి చోటా బ్లీసింగ్,క్లోరినేషన్ చేయించాలని కోరారు.పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానికంగా ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు.