నేటి గదర్, జూలై 23,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో,
అలవాల వంశీ, 9052354516 :
ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉంటూ ప్రయాణికులకు ఉన్నతమైన సేవలను అందించి సురక్షితంగా గమ్య మార్గాలకు చేరుకోవాలని భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు డ్రైవర్లకు సూచించారు. మంగళవారం భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ లో నూతనంగా లహరి ఏపీ స్లీపర్ అండ్ సిట్టర్ బస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ను డిపో మేనేజర్ శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా బస్సు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు మాట్లాడుతూ… రాకపోకలను డ్రైవర్లు అప్రమత్తంగా, ప్రయాణికులకు మంచి సేవలు అందించాలని సూచించారు. ఈ బస్సు సేవలు భద్రాచలం టు బిహెచ్ఇయల్ వరకు కొనసాగుతాయని తెలియజేశారు. ప్రయాణికులు వినియోగించుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రత్నం రమాకాంత్, కొండశెట్టి కృష్ణమూర్తి, ఎండి నవాబ్, నర్రా రాము, అరికెల తిరుపతిరావు, భీమవరపు వెంకటరెడ్డి, కడియం రామాచారి, పుల్లగిరి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.