గోదావరి అప్డేట్స్ : రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
నేటి గదర్, జూలై 24,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో,
అలవాల వంశీ 9052354516 :
గోదావరి పరివాహక ప్రాంతాలలో గత ఐదు రోజులు నుండి నిదానంగా పెరుగుతూ వచ్చి గోదావరి నది మంగళవారం నాటికి ఉగ్రరూపం దాల్చిన ఉదృతంగా ప్రవహించింది. గరిష్టంగా అడుగుల మంగళవారం మధ్యాహ్నం సమయానికి 51.30 అడుగుల వరకు గోదావరి నీటిమట్టం చేరుకుంది. అప్పటినుండి గంట గంటకు నిదానంగా తగ్గుతూ వచ్చిన గోదావరి నీటిమట్టం ఈరోజు ఉదయం 03.51 గంటలకు 47.90 అడుగులకు చేరుకోవడంతో భద్రాచలం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరింపజేశారు. గోదావరి నది 43 అడుగులు దాటి ప్రవహిస్తున్నందున మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు. కాగా బుధవారం ఉదయం 10 గంటల సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నది 46.60 అడుగుల మేరకు ప్రవహిస్తుంది.
Post Views: 462